మోదీ స్కీంలో షిరిడీ సాయి కూడా....

December 14, 2015 | 12:49 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Shirdi Sai Baba Temple deposit 200 kg gold in modi gold scheme niharonline

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారం డిపాజిట్ పథకంలో త్వరలో షిరిడీ సాయినాథుని స్వర్ణాన్ని డిపాజిట్ చేయనున్నట్టు తెలుస్తోంది. మోదీ ఇచ్చిన పిలుపుతో ఇప్పటికే పలు దేవస్థానాలు బంగారాన్ని డిపాజిట్ చేసేందుకు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 200 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేయాలని షిరిడీ దేవస్థానం ట్రస్టు భావిస్తున్నట్టు సమాచారం. అయితే సాయిబాబాకు భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన బంగారాన్ని వేలం వేసి కరిగించవద్దంటూ 2012లో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బంగారం డిపాజిట్ చేసేందుకు అనుమతి కోసం సాయి ట్రస్టు పిల్ దాఖలు చేసే అవకాశం ఉంది.

కోర్టు అనుమతి వచ్చిన వెంటనే బంగారం డిపాజిట్ చేస్తారని, అంతకుముందుగా నిషేధం ఎత్తివేతకు పరిష్కార మార్గాలను చర్చిస్తామని షిరిడీ ట్రస్టు ఈవో తెలిపారు. ప్రస్తుతం షిరిడీ ఆలయంలో బాబా విగ్రహంపై ఉన్న 180 కేజీల బంగారాన్ని అలాగే ఉంచుతారు. అది కాకుండా రెండువందల కిలోల బంగారం షిరిడీకి ఉంది. దాన్నే డిపాజిట్ చేస్తారన్నమాట. ఇప్పటికే ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం 40 కేజీల బంగారాన్ని కేంద్ర పథకంలో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తొలుత ప్రకటించినట్లు తిరుపతి దేవస్థానం ఇప్పటిదాకా బంగారం డిపాజిట్ పై నిర్ణయం తీసుకోకపోవటం గమనార్హం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ