మోదీనా మజాకా... సీన్ రివర్స్

September 24, 2015 | 12:25 PM | 5 Views
ప్రింట్ కామెంట్
modi-grand-welcome-in-us-niharonline.jpg

ప్రధాని నరేంద్ర మోదీ ఆ హోదాలో రెండోసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇదే టైంలో గుజరాత్ లో పటేళ్ల ఆందోళన గురించి తెలిసిందే. దీంతో ఎలాగైనా సరే మోదీ పర్యటనను అడ్డుకోవాలని ఎన్నారై పటేల్ వర్గాలు ఫ్లాన్ చేశాయి. ప్రధాని హోదాలో అమెరికాలో రెండోసారి పర్యటిస్తున్న మోదీ పర్యటనను అడ్డుకోవాలని ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఏంజరిగిందో తెలీదు కానీ... ఆ ఆలోచనను విరమించుకుంది. వారే స్వయంగా మోదీకి అమెరికాలో ఘనస్వాగతం పలికారు.

ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలోని న్యూయార్క్ నగరానికి వచ్చిన మోదీ అక్కడి వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్ లో బస చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని జరుగుతున్న నిరసనలకు మద్దతుగా, ఈ హోటల్ ముందు తలపెట్టిన ప్రదర్శనను గుజరాత్ ఎన్నారై పటేళ్లు విరమించుకున్నారు. నిరసన తెలిపేందుకు వచ్చిన వారంతా మోదీకి స్వాగతం పలికారు. రాళ్లు వేద్దామనుకున్నవారే పూలు వేశారు మొత్తానికి. మోదీనా మజాకా మరి. కాగా, నేడు, రేపు అమెరికన్ కంపెనీల సీఈఓలతో బిజీగా గడపనున్న మోదీ, శనివారం నాడు వెస్ట్ కోస్ట్ కు వెళ్లేముందు జర్మనీ చాన్స్ లర్ అంజెలా మెర్కెల్, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రెజిల్ అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్ తదితరులతో సమావేశమై చర్చలు జరపనున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ