ఇదే మా విజయానికి సంకేతం!

October 03, 2015 | 01:49 PM | 2 Views
ప్రింట్ కామెంట్
narendra-modi-in-banka-rally-niharonline

బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో బీజేపీ ఉంది. మరోవైపు కమలం హవా దేశంలో లేదని చెప్పేందుకు ఈ ఎన్నికలను వాడుకోవాలని జనతా పరివార్ కూటమి చూస్తుంది. ఇద్దరిలో పై చెయ్యి ఎవరిదో తెలిసేందుకు టైం ఉంది. కానీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పీడ్ ముందు మహ కూటమికి పరాభవం తప్పేలా లేదని సర్వేలు చెబుతున్నాయి. ఇక వరుస సభల్లో బీజేపీని, మోదీని ఏకీపడేస్తూ ఆర్జేడీ, జేడీయూ ముందుకు వెళ్తుంటే... ధీటుగా ర్యాలీలతో కదం తొక్కుతున్నారు ప్రధాని మోదీ.

ఇందులో భాగంగా బంకాలో ఆదివారం ఓ సభను నిర్వహించారు. ఈ సభలో కూడా ప్రజాభిమానాన్ని ఆకర్షించే దిశగా మోదీ అడుగులు వేశారు. తన వాక్ చాతుర్యంతో మరోసారి బీహార్ ప్రజలను కట్టిపడేశాడు. ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ, ఈ సభకు హాజరైన జన ప్రవాహాం చూస్తే తెలుస్తుంది. ఇదే మా విజయానికి సంకేతమని అన్నారు. బీహార్ కు ఉద్యోగాలు, అభివృద్ధి విధానం అవసరమని అన్నారు. వాటిని సాధించేందుకు ఎన్డీయేకు ఒక్క అవకాశమివ్వాలని ఆయన కోరారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బీహార్ ను అభివృద్ధి చేసే సామర్థ్యముందని అన్నారు. బీహార్ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని, ఎన్డీయే అధికారంలోకి వస్తే అలాంటి అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. బీహార్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. కాగా, ఈ సభలో ప్రధానితోపాటు రాంవిలాస్ పాశ్వాన్, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ