బీహార్ లెక్కల్లో బోల్డెన్ని బొక్కలున్నాయ్...

September 01, 2015 | 05:55 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Modi-bhagalpur-rally-fire-on-nitish-sarkat-niharonline.jpg

బీహార్ ఎన్నికల వేడిని దేశ ప్రధాని తన మాటలతో మరింత వేడెక్కించారు. భాగల్ పూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రాభివృద్ధికి రూ.3.76 లక్షల కోట్లు ఇచ్చిందని, వాటిలో రూ.2.70 లక్షల కోట్లకు మాత్రమే లెక్కలున్నాయని అన్నారు. మిగతా రూ.1.06 లక్షల కోట్లు ఏమయ్యాయి? ఎవరు మేశారు? అని సీఎం నితీశ్ నుద్ధేశించి సెటైర్లు వేశారు. నాపదవీ కాలం ముగిసేలోగా ఐదేళ్లలో ఏయే పనికి ఎంతెంత ఖర్చు చేశామో పైసా లెక్కలు చూపుతాం. అదే పనిని బీహార్ ప్రభుత్వం చెయ్యగలదా; కేంద్రం ఇచ్చిన నిధుల్లో పెద్ద మొత్తానికి ఇక్కడి పాలకులు లెక్కలు చూపడం లేదు. అంటే అర్థం ఏమిటి? ఎవరూ మేశారు అని ప్రధాని ఆవేశంగా నిలదీశారు. వరుస బహిరంగ సభల్లో మోదీ తన ప్రతాపాన్ని చూపుతూ... బీహార్ సర్కార్ ని దుమ్ము దులుపుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ