హిందూ మహా సముద్రంపై తన గుత్తాధిపత్యాన్ని. నావికా బలగంలో తన సత్తాను ప్రపంచానికి చాటేందుకు భారత్ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచ అగ్ర రాజ్యాలైన అమెరికా, జపాన్ తో కలిసి సంయుక్తంగా సముద్రంపై ప్ర్యతేక యుద్ధక్రీడను నిర్వహించనుంది. గతంలో 8 ఏళ్ల కిందట చైనా ఇలాంటి డ్రిల్ డ్రిల్ చేసింది. ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రం నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ సముద్రంపై పరోక్షంగా ఆధిపత్యం చెలాయించేందుకు చైనా పోటీదారుగా భారత్ నిలుస్తోంది. అటు భూసరిహద్దు విషయంలోను చైనా వ్యవహారం శృతిమించుతున్న నేపథ్యంలో పరోక్షంగా భారత్ సత్తాను చూపించాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో సముద్ర తలంపై మోదీ సర్కార్ భారత నౌకా విభాగంతో భారీ యుద్ధ క్రీడను నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇఫ్పటికే భారత్, అమెరికా, జపాన్ మిలటరీ అధికారులు జపాన్ లోని యోకోసుకా అనే నేవీ స్థావరం బుధవారం, గురువారం రెండు రోజులపాటు చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. భారీ స్థాయిలో ఈ ఎక్సర్ సైజ్ మూడు దేశాలు ఉమ్మడిగా నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.