తానేం 50 ఏళ్లు అధికారంలో లేనని, కానీ, ఉన్న 50 నెలల కాలంలో (5 సంవత్సరాల్లో) అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శుక్రవారం సొంత నియోజకవర్గం వారణాసిలో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు ప్రజలకు ఏం చెయ్యాలేకపోయినా, ఇప్పుడు మాపై విమర్శలు గుప్పిస్తున్నాయని, ఇది చాలా హస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉండాలని ఉద్దేశంతో పథకం ప్రారంభిస్తే, దానిపై విమర్శలు చేస్తున్నారని. జీవితంలో అకౌంట్ ను తెరవని వారు కూడా తమ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని చతురులు పేల్చారు. ఇఫ్పటి దాకా 18 కోట్ల ప్రజలు బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. 30,000 కోట్ల డబ్బును డిపాజిట్ చేశారని తెలిపారు. పేదలు కూడా డబ్బును జమ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. పార్టీ పేరు ప్రస్తావించకుండా మోదీ చేసిన కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేసినవో మనకు తెలిసిందే.