అమరావతి రోజు 4 కంపెనీలకు శంకుస్థాపన

October 17, 2015 | 04:03 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-inagurate-4-mobile-companies-on-amaravathi-niharonline

అక్టోబర్ 22వ తేదీన అమరావతిలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో అనంతరం చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో నాలుగు మొబైల్ ఫోన్ తయారీ ప్లాంట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు.

సెల్‌కాన్, మైక్రోమాక్స్, కార్బన్, లావా, మరో నాలుగు విడిభాగాల తయారీ కంపెనీలకు రేణిగుంట విమానాశ్రాయానికి ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ భూముల్లో ప్లాంట్ లను నెలకొల్పి శరవేగంగా తన ఉత్పాదనలను ప్రారంభించేందుకు ఆయా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం పూర్తిఅయిన అనంతరం మోదీ తిరుపతి బయలుదేరి వెళతారు. ఈ సందర్భంగా రేణుగుంటలోని నాలుగు మొబైల్ ఫోన్ తయారీ ప్లాంట్ లకు శంకుస్థాపన చేస్తారు. దాదాపు 2000 కోట్ల పెట్టుబడులతో 65 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పతున్న ఈ ప్లాంట్ ల ద్వారా దాదాపు 10,000 మందికి ఉపాధి లభించే అవకాశముంది.

ఇప్పటికే చిత్తూరులోని శ్రీసిటీ ఎస్ఈజడ్‌లో తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ సెల్‌ఫోన్‌ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లకు ఈ సంస్థ కాంట్రాక్ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసి ఇస్తోంది. షియోమి, ఆసుస్, వన్ ప్లస్, జియోని కంపెనీలు ఇప్పటికే ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ