వర్షాకాల సమావేశాలు సజావుగా సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ మీడియాతో మాట్లాడారు. నిన్నటి అఖిల పక్ష భేటీ సంతృప్తిగా జరిగిందని, అన్ని పక్షాలు సభ సజావుగా జరిగేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చాయని అన్నారు. ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని అందుకు ఎంపీలంతా సహకరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. కాగా, మంగళవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యవహారించాల్సిన వ్యూహాలపై మోదీ ఆదివారం నుంచే పార్టీ ప్రతినిధులతో చర్చించారు. ఈ చర్చలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వసుంధర రాజే, పంకజ్ ముండేలతోపాటు స్మృతి ఇరానీ లను కూడా ఆహ్వానించాలని అనుకన్నప్పటికీ సమస్య తీవ్ర తరం అవుతుందన్న ఉద్దేశంతో వద్దనుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం... రాజ్యసభలో విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.