సంక్షోభాన్ని ఎలా క్యాష్ చేసుకుంటున్నారంటే...

September 08, 2015 | 10:22 AM | 3 Views
ప్రింట్ కామెంట్
modi-with-industrialists-global-economic-scene.jpg

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. ఆ సంక్షోభం ద్వారా భారత్ కి లాభమేనని, దీనిపై వ్యాపారవేత్తలతో చర్చించాలని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీనికి ప్రధానియే స్వయంగా అధ్యక్షత వహించనున్నారు. గత నెలలో చైనా కరెన్సీ పతన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. భారత మార్కెట్ పై కూడా దీని ప్రభావం బాగానే చూపింది. అయితే దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ... చైనా ఆర్థిక సంక్షోభం ఒక రకంగా మనకు మంచినే కలగజేసిందని, ‘మేకింగ్ ఇండియా’ ప్రచారానికి ఇది ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ సమావేశంలో మోదీతోపాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ట్రీలతోపాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ శక్తికాంత దాస్ హాజరుకానున్నారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్, ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యా, మహీంద్రా సీఎండీ ఆనంద్ మహీంద్ర, ఆదిత్య బిర్లా గ్రూప్ కుమార మంగళ బిర్లా కూడా హాజరవ్వచ్చని విశ్వసనీయ  వర్గాల సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ