ఆరు నూరైనా పీఎం ఆ పని చెయ్యరుగాక చెయ్యరు

August 12, 2015 | 05:20 PM | 1 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_sonia_gandhi_follows_foot_niharonline

యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు సోనియా గాంధీ చెప్పినట్లు ఆడేవారు. తప్పని సరి పరిస్థితుల్లో అలా చేసే వారు. పైకి చూస్తే కాంగ్రెస్ శత్రువులుగా ఉండే నేతలు, లోపల మాత్రం మిత్రులుగా వ్యవహారించే వారు. ఇలాంటి వారిలో ములాయం, మాయావతి ముందు వరుసలో ఉండేవారు. సీబీఐ బూచి ని చూపి వారిపై కేసుల ఆధారంగా భయపెట్టేవారు. కీలకమైన బిల్లుల మద్దతు సాధించేందుకు వారు ఆ పనిచేసేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ ఆ పనిని కొనసాగిస్తారా? సభ సజావుగా సాగేందుకు నిన్న ములాయం కాంగ్రెస్ వర్గాలకు వార్నింగ్ ఇవ్వటం వెనుక ఇదే కారణమయి ఉండొచ్చని గుసగుసలాడారు.

                         అయితే మోదీకి ఆ అవసరం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం లేకపోలేదంటున్నారు. చరిష్మా ను తగ్గించేందుకు  జనతా పరివార్ పేరిట పార్టీ పెట్టి బహిరంగ విమర్శలను గనుక సీరియస్ తీస్కుని ఉంటే పార్టీ వచ్చిన ప్రారంభంలోనే ఆ పని కానిచ్చేవారని వారంటున్నారు. కానీ, అలా చెయ్యలేదు. ఒక వేళ అలాంటిదేమన్నా ఉంటే వాటి వల్ల ఆయన ఖ్యాతికి దెబ్బ తగలుతుందున్న ముందు జాగ్రత్తతో మోదీ అలాంటి పని చెయ్యడని వారంటున్నారు. సార్వత్రిక  ఎన్నికల్లో వచ్చిన సానుభూతి ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పిచ్చి నిర్ణయాలతో పార్టీని పాతాళానికి పడిపోయే స్థితికి తీసుకురాడని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా యూపీఏ లా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరం మోదీకి లేదనేది మాత్రం అందరు ఒప్పుకుని తీరాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ