నరేంద్ర ‘చతుర’ మోదీ: ప్రతిపక్ష పాచికలు పారేనా?

July 21, 2015 | 05:02 PM | 3 Views
ప్రింట్ కామెంట్
modi_taking_steps_for_land_bill_mansoon_session_niharonline

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భూసేకరణ బిల్లు కోసం తస్మదీయులందరూ తల్వార్లు నూరుకుంటున్నారు. రాహుల్ ని కూడా దీనికోసం బాగా కసరత్తు చేసి జై బాహుబలి అని రంకె వేయమని కాంగ్రెస్ ముందుకు తోస్తుంది. ఇట్టి వాతావరణంలో రణభేరి మ్రోగించనున్న విపక్షాల ఆశలు అడియాశలు చేస్తూ బిల్లు పెట్టకుండా ఆర్డినెన్సు తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం పాచికలు కదుపుతోంది. ఆర్డినెన్స్ అయితే బిల్లులా పెద్ద కష్టాలేం పడకుండా, వారి అభిప్రాయాన్ని సీరియస్ గా తీసుకోకుండా కానిచ్చేయోచ్చని మోదీ ఐడియా. అందరి అభిఫ్రాయాలూ వినడానికి జాయింటు పార్లమెంటు కమిటీ వేశాంకదా, దాని కార్యక్రమం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత చూద్దామని ప్రభుత్వం అతిశయంగా యాభై రెండు అంగుళాల ఛాతీ విరుచుకుంటోంది. అసలు విషయం ప్రతిపక్షాలకి తెలుసు, ప్రభుత్వం ధైర్యం లేక కప్పదాట్లు వేస్తోందని, పనిలో పనిగా అన్నాహజారే నిరాహార దీక్ష కోసం టెంట్లు, పరుపులు ఆర్డరిచ్చి ఉత్సహపడుతున్నాడు. మోదీ వీరందరి కొరిక తీర్చడానికి అమాయకుడా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ