ఓవైపు అగ్రరాజ్యం అమెరికాతో సత్సబంధాలు నడుపుతూనే మరోవైపు రష్యాతో కూడా అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా మైత్రిని మరింత పెంచుకుంటూ వస్తున్నారు కూడా. ఇక బుధవారం (అక్టోబర్ 7న) ఆదేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మోదీ తన ట్విట్టర్లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘మీ పుట్టిన రోజు సందర్భంగా నా శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్నీ జరుపుకోవాలని, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను అని ట్వీటారు. ఇరు దేశాల మధ్య ఆర్థికాభివృద్ధి కోసం భవిష్యత్ లో మరిన్నీ ఒప్పందాలు జరగాలని, తద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలని’ ఆశిస్తున్నట్లు తెలిపారు.
రక్షణ, ఇంధన రంగాల్లో ఇరు దేశాల సంబంధాలు పటిష్టంగా సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌కు పుతిన్ ఎన్నోసార్లు ధన్యవాదాలు తెలిపారు కూడా. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. మోదీ అంటే అమెరికా అధ్యక్షుడు ఒబామాకు విపరీతమైన అభిమానం. అలాగే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కి కూడా. అస్సలు పడని ఆ రెండు దేశాలతో ఏకకాలంలో మైత్రి కొనసాగిస్తూ మరో వైపు ఒప్పందాల పరంగా కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న నేత ఒక్క మోదీనే కావటం విశేషం.