మోదీ లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నట్లే

September 29, 2015 | 01:12 PM | 2 Views
ప్రింట్ కామెంట్
PM-narendra-modi-newyork-times-article-niharonline

ఇలా పర్యటన ముగించుకుని భారత్ కి తిరుగు పయనం అయ్యారో లేదో అమెరికాలో మరోసారి మోదీని ఆకాశానికెత్తేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై అమెరికా మీడియా ఆసక్తికర కథనాలు రాసింది. మోదీ మాటతీరు, సమ్మోహన ప్రసంగాలతో సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజాల మనసులను గెలుచుకున్నారని ఆ దేశ పత్రికలు ప్రధాన శీర్షికలతో కథనాలు ప్రచురించాయి. అమెరికాలో అత్యంత ప్రజాదరణ కలిగిన పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ మరింతగా మోదీ పర్యటనను ఆకాశానికెత్తేసింది. ‘నరేంద్ర మోదీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కాంకర్స్ సిలికాన్ వ్యాలీ’ పేరిట పతాక శీర్షికలో కథనాన్ని రాసింది.

సిలికాన్ వ్యాలీలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ తదితర దిగ్గజ కంపెనీల అధిపతులతో మోదీ జరిపిన భేటీ, అక్కడి ఎన్నారైలను ఉద్దేశించిన మోదీ చేసిన ప్రసంగాన్ని ఈ కథనంలో ఆ పత్రిక ప్రధానంగా ప్రస్తావించింది. మోదీ ప్రసంగానికి ఎన్నారైల నుంచి వెల్లువెత్తిన స్పందనను కూడా ఆ పత్రిక ఆకాశానికెత్తేసింది. టెక్నాలజీకి కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దాలన్న తన లక్ష్యాన్ని మోదీ దాదాపు సాధించారని కూడా ఆ పత్రిక పేర్కొంది. ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు భారత్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అంగీకారం తెలపడమే ఇందుకు నిదర్శనమని ఆ కథనం పేర్కొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ