వైవిధ్య ప్రచారాలకు పెట్టింది మారుపేరైన ప్రధాని మోదీ మరోసారి అలాంటి పిలుపునిచ్చారు. సినిమా తారలు చేనేత ఉత్పత్తులు వాడాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం చెన్నైలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో మోదీ పాల్గొన్నారు. మద్రాస్ యూనివర్సిటీ లో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ... సినిమా నటులు తమ ప్రతి ఐదు సినిమాల్లో ఒక చిత్రంలో చేనేత, చేతి ఉత్పత్తులు వాడితే... ఈ సినిమాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. ఫ్యాషన్ కు ప్రాచుర్యం కల్పించడంలో సినీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. ప్రస్తుత యువత ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారని, చేనేత వస్త్రాలను కూడా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచితే ఖచ్ఛితంగా అమ్ముడుపోతాయని ఆయన సూచించారు. మార్కెట్ లో చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సదస్సు కోసం వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి జయలలిత ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి విందుకు కూడా వెళ్లారు.