కాస్త గ్యాప్ ఇచ్చి దేశ ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి విదేశీ టూర్లు ప్రారంభించారు. ఈరోజు తెల్లవారుఝామున ఆయన ఢిల్లీ నుంచి ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరారు. అక్కడ కాసేపు మాత్రమే ఆయన గడుపుతారు. ఇక అటునుంచి అటు ఆయన అమెరికా బయలుదేరతారు.
అక్కడ జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారు. అనంతరం సిలికాన్ వ్యాలీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేయనున్న సమావేశానికి హాజరవుతారు. ఆపై ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ సహా అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఐర్లాండ్, అమెరికా పర్యటనలను ముగించుకుని మోదీ 29న తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. కాగా, గడచిన 60 ఏళ్ల కాలంలో ఐర్లాండ్ లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డులకెక్కనున్నారు.