క్రేజ్ ను ఇలా కూడా క్యాష్ చేసుకోవచ్చా?

August 28, 2015 | 03:38 PM | 3 Views
ప్రింట్ కామెంట్
PM_narendra_modi_image_rakhi_niharonline.jpg

దేశ ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ ను ఇలా కూడా క్యాష్ చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు కొందరు వ్యాపారస్థులు. దేశవ్యాప్తంగా రేపు రక్షాబంధన్ వేడుకలకు సిద్ధమైపోతుంది. ఆన్ లైన్ రాఖీలు, గ్రీటింగ్స్ వచ్చి దెబ్బ కొట్టడంతో కొందరు వ్యాపారస్థులు రాఖీల అమ్మకానికి వినూత్నమైన ఐడియా వేశారు. అంతే దెబ్బకు మొత్తం అమ్ముడు పోయాయి. రాఖీలపై నరేంద్ర మోదీ ఫోటో ఉన్న స్టిక్కర్లు అంటిచేసి అమ్ముతున్నారట. ఫ్లాన్ వర్కవుటయి పాతవి అమ్ముడు పోవటంతో ఒక్కరోజు ముందుగానే కొత్తవి కూడా తయారు చేసి అమ్మేస్తున్నారుట.

                     ఇదిలా ఉండగా పంజాబ్‌ లూథియానాలోని ఓ  స్కూల్‌లోని విద్యార్థులు గ్రూపులుగా కూర్చొని రాఖీలు తయారు చేస్తున్నారు. రాఖీ పండుగ రోజున తమ సోదరులకు ఈ రాఖీలు కట్టేందుకు సిద్ధమవుతున్నారు. చాలా తక్కువ ఖర్చుతో ఈ రాఖీలు తయారు చేయడం ఒక వంతు అయితే మోదీ ఫోటోలు పెట్టి రాఖీలు తయారు చేయడం మరో వంతు. మోదీ గౌరవార్థం తామంతా ఇలా చేస్తున్నామని ఆ చిన్నారులు చెప్పుకొచ్చారు. ఇలా వీరు విక్రయించిన డబ్బును సంక్షేమ నిధికి జమ చేస్తారుట. వ్యాపారస్థులకు, విద్యార్థులకు ఎంత తేడా కదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ