జార్ఖండ్ తొక్కిసలాటపై మోదీ ట్వీట్

August 10, 2015 | 01:04 PM | 1 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_on_jarkhand_temple_stampede_niharonline

జార్ఖండ్‌ తొక్కిసలాటపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దియోగఢ్ దుర్గామాత ఆలయంలో  ఈ ఉదయం 5.45 గంటలకు తోపులాట జరిగిన విషయం విదితమే. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దీనిపై ప్రధాని మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట విషయాలను ఆ రాష్ట్ర సీఎం రఘుబార్‌దాస్‌ను అడిగి మోదీ తెలుసుకున్నారు.

శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయం బయట భక్తులు బారులు తీరారు. ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరవగానే భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందంటూ భక్తులు కాసేపు బైఠాయించి ఆందోళన చేపట్టారు. .  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ