పహ్లాద్ నిహ్లానీ అనే పేరు గలాయన భజనలా భజించే ఒక భక్తి గీతాన్ని తయారు చేసి మోడీకి అంకితం ఇచ్చేరు. ఈయన ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ గా వ్యవహరిస్తుండగా ఇటువంటి స్తోత్రాలు వల్లించడం తగదని మనీష్ తివారీ కోపించేరు. అలా ‘గయ్’ మనకపోతే కాంగ్రెసు నేత కానే కాదుగా మరి. మోదీగారు పదవిలోకి వచ్చే ప్రయత్నం చేసేటపుడు వచ్చిన ఎన్నికల్లో ఒక టీం ఆయన్ని కీర్తిస్తూ హర్ హర్ మోదీ ఘర్ ఘర్ మోదీ అని టాప్ లేపేశారు. ఇందులో గాంధీగార్ని మోదీతో జతకలిపి వీరివురి కలలు భారత యువత సాకారం చేయాలని పిలుపునిచ్చేరు. మోదీ అంటే చేతల మనిషి అని ఆయనకు ఎవరూ సాటి లేరని అందుచేతనే ఆ మహానుభావుడికి అంకితమిచ్చేనని మోదీ భక్త నిహలానే భక్తి పూర్వకంగా శలవిచ్చేరు. కాంగ్రెసు నాయకులు తన భక్తిని శంకించడం నచ్చనందున ఈ భజన గీతం రాజకీయ పార్టీ కై రూపొందించలేదు. ప్రధాని మోదిని వ్యక్తిగతంగా దృష్టిలో ఉంచుకునే ‘మేక్ ఇన్ ఇండియా’ అన్నాడు. పార్టీ కోసం రాస్తే తప్పా? వ్యక్తిపూజ చేస్తూ భజిస్తే తప్పా? అసలు పూజ చేస్తే తప్పనడానికి ఏ సెన్సారు అడ్డొస్తాడో చూద్దామంటున్నాడు!