ప్రధాని కోసం స్పెషల్ దారి

October 19, 2015 | 05:00 PM | 1 Views
ప్రింట్ కామెంట్
special-road-for-modi-niharonline

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు విచ్చేస్తున్న ప్రధానికి ఏపీ సర్కార్ ప్రత్యేక ఆహ్వానం పలకనుంది.  ప్రాంగణానికి వెళ్లేందుకు పలు ప్రధాన రహదారుల నిర్మాణంతోపాటు ప్రత్యేకంగా ఒక్క ప్రధానమంత్రి కోసమే ఓ రోడ్డు ఆగమేఘాలపై ఏర్పాటవుతోంది.

కృష్ణానది కరకట్టకు ఇరువైపు లా ఏర్పాటుచేస్తున్న హెలిప్యాడ్లు, శంకుస్థాపన ప్రాంగణాలను స్వల్పదూరంలో నేరుగా కలుపుతూ హెలిప్యాడ్ల నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేరుగా వేదికకు చేరుకునేందు కు వీలుగా రహదారిని నిర్మిస్తున్నారు.

 గన్నవరం విమానాశ్రయంలో ప్ర త్యేక విమానంలో నుంచి దిగిన అ నంతరం అక్కడినుంచి హెలికాప్టర్‌ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన స్థలికి చేరుకుంటారు. హెలిప్యాడ్‌ నుంచి కరకట్టకు, అక్కడి నుంచి నేరుగా శంకుస్థాపన వేదిక వ ద్దకు ప్రత్యేకంగా రహదారి పనులు తుదిదశకు చేరాయి. ఎత్తులో ఉండే కరకట్టకు అటు హెలిప్యాడ్‌ నుంచి ఎక్కేందుకు, మళ్లీ కరకట్ట నుంచి దిగువన ఉండే సమావేశ ప్రాంగణానికి చేరేందుకు వీలు గా ఈ రహదారిని ఏటవాలుగా నిర్మిస్తున్నారు.

  ఇక శంకుస్థాపన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంచార మొబైల్‌ టవర్‌ సందర్శకులను ఆకట్టుకుంటోంది. మొబైల్‌ టవర్‌ను ఒక ట్రక్‌పై ఉంచారు. ఈ వేడుక ఏర్పాట్లలో పాల్గొంటున్న వారి కారణంగా ఒక్కసారిగా ఈ ప్రదేశంలో పెరిగిన సెల్యులార్‌ రద్దీని తట్టుకునేందుకు ఏర్పాటు చేసిన దీనిని కార్యక్రమం ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి తరలిస్తారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ