అగ్రరాజ్యం మరోమారు మోదీని మోసేసింది

August 24, 2015 | 05:45 PM | 2 Views
ప్రింట్ కామెంట్
white_house_praises_indian_prime_minister_narendra_modi_niharonline

భారత ప్రధాని నరేంద్ర మోదీ ని అగ్రరాజ్యం పొగుడుతూనే వస్తుంది. ఆయన అధికారంలోకి వచ్చిన మొదలు ఇప్పటి దాక పలు సందర్భాల్లో ఆయన చేసిన పనులపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంది. తాజాగా విదేశీ పెట్టులబడులను ఆకర్షించడానికి మోదీ చేస్తున్న కృషిని అమెరికా కొనియాడింది.

                           అయితే బ్యూరో క్రాట్ల తీరు సరిగ్గా లేదని, వారి రెడ్ టేపిజమ్ పెట్టుబడులకు ఆటంకంగా మారాయని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. పెట్టుబడి పెట్టాలన్న మోదీ పిలుపు ఓ వైపు అదే సమయంలో ఆటంకాలు సమాంతరంగా ఉన్నాయని జాతీయ భద్రతా మండలిలో దక్షిణాసియా వ్యవహారాల డైరక్టర్ పీటర్ లెవోయ్ పేర్కొన్నారు. అయితే కీలకాంశాల్లో మాత్రం మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇంత వరకు ఏ ప్రధాని తీసుకోలేదని ఆయన తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ