ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి... ఎందుకంటే?

March 23, 2015 | 01:07 PM | 156 Views
ప్రింట్ కామెంట్
amaravathi_AP_capital_niharonline

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ విషయంలో బోల్డెన్ని అనుమానాలు రెకెత్తాయి. అసలే లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న రాష్ట్రానికి అదనంగా రాజధాని నిర్మాణం ఓ పెద్దసమస్యగా మారబోతుందని అనుకున్నారంతా. పైగా రాజధానికి కావాల్సిన భూ సేకరణ విషయంలో కూడా అనేక రాద్ధాంతాలు ఏర్పడ్డాయి.  విదేశీ నగరాలతో పోటీపడే విధంగా కొత్త రాజధాని నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్న సంగతి తెలిసిందే. చివరికి ఎలాగోలా సమస్యలన్నింటికి చెక్ పెట్టి రాజధాని నిర్మాణానికి పూనుకునేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 80 శాతానికి పైగా రైతులు రాజధాని నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం... రాజధానికి అమరావతి అనే పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.అయితే రాజధానిగా అమరావతి పేరునే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. వీటికి కారణాలు లేకపోలేవు.

కొత్త రాజధాని విజయవాడ, గుంటూరు నగరాల మధ్య తుళ్ళూరు ప్రాంతంలో అభివృద్ధి చేస్తోంది. ఇక తుళ్లూరు కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే అమరావతి ఉంది. సుమారు 2 వేల సంవత్సరాల చరిత్రగల కట్టడం కావటంతోనే సంస్క్రుతికి, భవిష్యత్తుకు అద్దంపట్టేలా ఉంటుందని దీనిని ఎంపిక చేశారట.   ఉజ్వలమైన భవిష్యత్తు వున్న ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమోఘమైన చరిత్ర కూడా వున్న అమరావతి పేరు పెట్టడం సముచితమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ రాజధానికి పెట్టడం వల్ల రాజధానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు చాలా త్వరగా రావటంతోపాటు పెట్టుబడులు కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ