డీకే దాదాగిరికి జడిసిన గులాబీ దళం

March 10, 2015 | 01:00 PM | 43 Views
ప్రింట్ కామెంట్
DK_Aruna_fire_in_T_assembly_niharonline

అధికార, ప్రతిపక్షం, విపక్షం ఆ పక్షం ఈ పక్షం అని తేడా లేకుండా తెలంగాణా అసెంబ్లీ సమావేశాలలో వాడి వేడి మాటల వడ్డింపు జరుగుతోంది. ఇక తాజాగా మంగళవారం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ కి వెళ్లింది. మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ మహబూబ్ నగర్ జిల్లా గుర్రంగడ్డ అభివృద్ధి గురించి మాట్లాడుతున్న సమయంలో అసలు గొడవ మొదలైంది. అరుణ ప్రశ్నలు చదువుతున్న సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కలుగజేసుకున్నారు. దీంతో అరుణ ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. నోర్ముసుకో.. ఏం మాట్లాడుతున్నావ్.. మహిళలతో పద్ధతి ఇదేనా.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇలాగేనా... టీఆర్ఎస్ పార్టీలో ఎలాగూ మహిళలను నోరు మూపించేశారు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ చెప్తే మీరు నోరు మూసుకుంటారేమో గానీ మేము మూసుకోం అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కౌంటర్ ఇచ్చేందకు ఏ ఒక్కరు ధైర్యం చేసి ముందుకు రాలేకపోయారు. చివరాఖరికి ఐటీ మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని గతంలో మంత్రిగా పనిచేసిన మీరు ఇలా మాట్లాడటం పద్ధతేనా అమ్మా అని ప్రశ్నించటంతో ఆమె శాంతించారు. ఇక ఆమె ఎలాగూ తగ్గారు కదా అనుకున్న కేటీఆర్ మీ దాదాగిరి ఏదైనా ఉంటే మహబూబ్ నగర్‌లో చూపించుకోండి ఇక్కడ వద్దు అంటూ చురకలంటించారు. అంతేకాదు అసెంబ్లీలో బంగ్లా రాజకీయాలు పనికిరావంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. మొత్తానికి సభలో అధికార పక్షానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరనుకున్న సమయంలో మాజీ మంత్రి అరుణ సీన్లోకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ