షాడో సీఎం ఇచ్చిన కవర్ లో ఏముంది?

January 13, 2016 | 11:06 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Doctors Letter Talks Of Lalu Prasad Proxy Health Minister Act Niharonline

లాలూ ప్రసాద్ యాదవ్ దాదాపుగా అన్ని స్థాయిల్లోనూ పదవులు అనుభవించారు. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ (ఆర్జేడీ) అధినేత బీహార్ కు సీఎంగానే కాక కేంద్ర మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రిగా తనదైన శైలిలో ఆయన రాణించారు. అప్పటిదాకా నష్టాలతో సతమతమవుతున్న భారతీయ రైల్వేలను లాభాల బాట పట్టించిన లాలూ పనితీరుకు అచ్చెరువొందిన పలు విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ప్రసంగాల కోసం ఆయనకు ఆహ్వానాలు పంపాయి. దాణా స్కాంలో గడ్డి కరిచిన నేపథ్యంలో లాలూ దాదాపుగా రాజకీయాలకు దూరమయ్యారు. గతంలో భార్యను సీఎం కుర్చీపై కూర్చోబెట్టి జైలు నుంచే పాలన సాగించిన ఆయన తాజాగా, బీహార్ లో మూడో దఫా నితీశ్ కుమార్ సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు దోహదపడ్డారు.

                          ఇదే కారణం చూపి తన చిన్న కుమారుడిని డిప్యూటీ సీఎం చేసుకున్న ఆయన పెద్ద కుమారుడిని ఆరోగ్య శాఖ మంత్రిని చేసుకున్నారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది... పెద్ద కుమారుడి ఆధ్వర్యంలోని బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహారాల్లో ఆయన తల దూర్చేశారు. ఇటీవల దర్బంగా మెడికల్ కళాశాల ఆసుపత్రిని సందర్శించిన లాలూ ప్రసాద్, అక్కడి వైద్యాధికారికి ఓ లేఖ అందజేశారు. ఆ లేఖలో ఏముందన్న విషయం నాడు బయటకు రాకున్నా, సదరు అంశాన్ని ఆ వైద్యాధికారి తాజాగా బయటపెట్టేశారు. విధుల నుంచి తీసేసిన నలుగురు మహిళా కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లాలూ ఆ లేఖలో వైద్యధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ లేఖపై విపక్షాలు మండిపడుతున్నాయి. పదవి లేకున్నా ‘సూపర్ సీఎం’, ‘షాడో సీఎం’గా లాలూ వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ