ఆ మంత్రిగారు మరీ ఇంత ఓపెనా?

January 21, 2016 | 12:47 PM | 2 Views
ప్రింట్ కామెంట్
nayab-singh-saini-try-to-bribe-a-village-vote-for-cash-niharonline

మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరాక నేతల నాలుకల ఏదీ పడితే అది మాట్లాడటం మనం చూస్తున్నదే. ముఖ్యంగా అధికార నేతలే ఘాటైన వ్యాఖ్యలతో కాంట్రవర్సరీలకు దిగుతూ వార్తల్లో హైలెట్ అవుతున్నారు. వారిని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కావటం లేదు కూడా. ప్రస్తుతం ఈ ట్రెండ్ కామన్ అయిపోయింది. ఇక్కడ హర్యానాకు చెందిన ఓ మంత్రివర్యుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాములు హైలెట్ కావట్లేదండోయ్. ఏకంగా లంచంతో ఓ గ్రామాన్నే కొనేందుకు యత్నించారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే, మరుక్షణమే గ్రామాభివృద్ధికి రూ.22 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఆ మంత్రి హామీ ఇచ్చి సీక్రెట్ కెమెరాకు అడ్డంగా బుక్కయ్యారు.

హర్యానా గనుల శాఖ మంత్రి నాయబ్ సైనీ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఓ గ్రామానికి వెళ్లారు. గ్రామంలోని మొత్తం ఓట్లన్నీ తమ అభ్యర్థికే వేయాలని ఓటర్లను కోరారు. అంతటితో ఆగని ఆయన ఓట్లేసిన మరుక్షణమే గ్రామానికి రూ. 22 లక్షల నిధులు మంజూరు చేయిస్తానని ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఓ వ్యక్తి మంత్రి గారి ప్రసంగాన్నంతటినీ రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఓటుకు నోటు కొత్తదేమీ కాకున్నా, మరీ ఇంత పబ్లిక్ గానా అన్నది ఈ సంఘటనతో రుజువైంది. ఇక ఈ ఘటనతో హర్యానాలోనే కాక కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ చిక్కుల్లో పడినట్లయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ