కుందూరి జానారెడ్డి... ఆతడనేక యుద్ధముల నారితేరిన రాజకీయ యోధుడు. యోధులకు సహజంగానే ఆగ్రహం మెండు. అసెంబ్లీలో ఆచార్యుల వారి వ్యవహార దక్షతను పిల్లకాకులు ప్రశ్నించటం జరిగింది. తక్షణమే ఉండేలు దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాలనే సంకల్పం సారుకి కలిగింది. పర్యవసానంగా ‘నువ్వెంత? నీ ష్థాయి ఎంత? ఝనారెడ్డి ఎలా ఉండాలో నువ్వు షెప్పాలా? నేను భీష్మాచార్యుడి సంది! ఎప్పుడేం చెయ్యాలో మాకు తెల్షు. నాకున్న తాఖీదులన్నీ తెలిసే అధిష్ఠానం కితాబిచ్చింది, నాకంటే కాకలు తేరిన వాడు ఉంటే చూష్కోండి’ అని అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. అంత షీనియర్ని పట్టుకుని మేలమాడితే మండుకు రావటం సహజం. మిడిమేలపు ప్రశ్నవేస్తే ముళ్లపానుపై శయనించినట్టవడంలో ఈ రాజకీయ భీష్ముడిది ఏమీ దోషం లేదు!