ఆంధ్ర సోదరులెప్పటికీ సంచార జాతులే!

March 11, 2015 | 05:17 PM | 60 Views
ప్రింట్ కామెంట్
kcr_andhra_people_niharonline

ఆంధ్రోళ్లని కడుపులో పెట్టుకుని చూస్కుంటా.. ఇక్కడ పుట్టినోళ్లందరూ ఇక్కడి బిడ్డలే. ఎవ్వరూ యాడికి బోనక్కర్లేదు... అనేది కేసీఆర్ అభిప్రాయం మనం వినడం జరిగింది. అది ద్రుఢమైనదా, నిశ్చితమైనదా అనే మీమాంస కాలమాన పరిస్థితుల గతితార్కిక భౌతికవాదానికి వదిలేద్దాం. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సాక్షిగా వీనులవిందైన సంభాషణలు, హావభావాలు ప్రజలను వినోదింపజేస్తున్నాయి. మహిళ అయినంత మాత్రాన మైకు విరగొట్టకూడదా అని డీకే అరుణాభరతసింహారెడ్డి పురుష ప్రపంచంతో ఢీకోన్న వైనం, నిండు సభలో పాంచాలి అక్కడే గుడ్లు మిటకరిస్తూ నిల్చున్న భీముడి గదను లాక్కుని పద్యాలేవీ పాడకుండా దుశ్శాసనుడి పనిబడితే ఎంత పసందుగా ఉండేది అనిపించింది. ఇది వర్తమాన భారతంలో క్షమాపణల పర్వానికి సంబంధించింది. కేసీఆర్ గారు కలుగజేసుకుని సముదాయించిన తదాది ఆయన ఆంధ్రా జనాలను సగౌరవంగా చూస్కుంటాం. మంచిగ చూస్కుంటే మంచి పౌరులుగా పన్నులు చెల్లిస్తూ టూరిస్టుల మాదిరి జీవనయాత్ర సాగించగలరు. వారు ఎప్పటికీ మంచి బుద్ధిమంతులైన టూరిస్టులుగా మిగిలిపోగలరని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అభిప్రాయాలు పాదరసంలాంటివి. భయంలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ