కేరళ అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జి. కార్తికేయన్(66) కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా లివర్ కేన్సర్ తో బాధఫడుతున్నారు. శనివారం 10.35 కు ఆయన బెంగళూరులోని హెచ్ సి జి ఆస్పత్రిలో ఐసియు లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పార్టీ సభ్యులు తెలిపారు. సంస్థ మంగళంలోని ఆయన ఇంట్లో ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతదేహాన్నిఈ రోజు సాయంత్రానికి కేరళ కు తరలించనున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు ఈయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణానికి ముఖ్యమంత్రి ఒమన్ చాంది సంతాపం ప్రకటించారు. ఆయన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకున్నారు.