మాటల మాంత్రికుని మంత్రాలకు రాలని చింతకాయలు

March 04, 2015 | 03:21 PM | 67 Views
ప్రింట్ కామెంట్
sitaram_ echuri_niharonline

అధికార పక్షం వెంకయ్య ద్వారా ఎంత లాలించి ఒప్పించే ప్రయత్నం చేసినా సీతారాం ఏచూరి తనకున్న హక్కులేమిటో విశదపరుస్తూ సవరణ చట్టం చేసి తీరాల్సిందేనని మొండి కేసి మాట నెగ్గించుకున్నారు. రాజ్యసభ చరిత్రలో ఇటువంటి సంఘటన జరగడం ఇది నాల్గవసారి. 1980లో జనతా పార్టీ, 1989లో వి.పి.సింగ్ ప్రధానిగా నేషనల్ ఫ్రంట్, 2001లో వాజ్ పేయి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అధికార పక్షం మొరాయించినప్పుడు పడ్డ మొట్టి కాయలివి. వెంకయ్య నాయుడు తన వాదనతో నచ్చ చెప్పే ప్రయత్నం విఫలమై, సీతారాం ఏచూరి లొంగిరాకుండా చేసిన ప్రతిపాదనతో సభలో ప్రభుత్వ బలహీనత బహిర్గతమై పోయింది. సవరణకు అనుకూలంగా 118 ఓట్లు, వ్యతిరేకంగా 57 ఓట్లు వచ్చిన దరిమిలా మోడీగారి మూడ్ మరింత ఖరాబు అయిపోయింది. ఎన్డీయే ప్రభుత్వానికి ఇవి రానున్న కాలంలో మోగుతున్న ప్రమాద ఘంటికలుగా భావిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ