శవరాజకీయాలు ఎవరివో అర్థం కావట్లేదు!

January 30, 2016 | 10:57 AM | 2 Views
ప్రింట్ కామెంట్
rahul-gandhi-dalit-scholar-death-HCU-niharonline

సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ మొన్నటిదాకా సైలెంట్ గానే ఉంది. రోహిత్ ఆత్మహత్యను అవకాశంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్సిటీలో పర్యటించడం, తాజాగా సామూహిక నిరాహార దీక్షలో పాలుపంచుకోవడంతో వారు ఫాంలోకి వచ్చారు. విద్యార్థి ఆత్మహత్యను రాజకీయం రాహుల్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని విరుచుకుపడింది. అంతేకాదు రాహుల్ పర్యటనను నిరసిస్తూ శనివారం తెలంగాణ వ్యాప్తంగా కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. అయితే దళితుడైనందుకే సంఘీభావం ప్రకటిస్తున్నానని చెబుతున్న  రాహుల్ తాజాగా తమిళనాడులో ముగ్గురు దళిత విద్యార్థినీలు చనిపోతే దానిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది.

                          మరోవైపు చనిపోయిన సమయంలో ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ, మరోసారి హైదరాబాద్ రావటం, అది కూడా అతని జన్మదినోత్సవం నేపథ్యంలో కావటంతోనే ఈ చర్చంతా. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంటే చుట్టపు చూపుగా చనిపోయిన తర్వాత వచ్చి పరామర్శించే నేతలు, మళ్లీ అదే ఘటనపై స్పందించటం ఆశ్చర్యానికి గురిచేసేది. దాంతో ఆయన రాకపై పలువురు ఆరోపణలు చేస్తున్నప్పటికీ దీక్షలో పాల్గొన్న వర్సిటీ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ, రోహిత్ తరపున న్యాయం కోసం పోరాడేందుకే వచ్చానని తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం వరకు రాహుల్ దీక్షలో పాల్గొనున్నట్లు సమాచారం. అయితే ఏబీవీపీ మాత్రం ఎలాగైనా సరే దానిని అడ్డుకుని తీరతామంటూ చెబుతుండగా, ఎన్ ఎస్ యూఐ మాత్రం దీక్ష ఆటంకం లేకుండా సాగేందుకు చూసుకుంటుంది. దీంతో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగే ఆస్కారం ఉండటంతో ప్రస్తుతం పోలీసుల్లో టెన్షన్ నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ