వరంగల్ ఎంపీకి వైఫ్ తోనే ఇబ్బందులా?

January 20, 2016 | 01:43 PM | 3 Views
ప్రింట్ కామెంట్
survey-file-petition-against-pasunuri-dayakar-election-niharonline

వరుస ఉప ఎన్నికల్లో విజయంతో దూసుకెళ్తున్న అధికార పక్షంకి వరంగల్‌ పార్లమెంట్ ఉప ఎన్నిక విజయం ఊహించిందే. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా నిలబెట్టిన పసునూరి దయాకర్ జాతీయ రికార్డు స్థాయిలో విజయం సాధించడం ఇక్కడ చెప్పుకోదగింది. పోటీలో కాంగ్రెస్ తరపున రాజయ్య కోడలి కేసుతో తప్పుకోవటంతో చివరి నిమిషంలో సర్వే వచ్చి చేరిన విషయం తెలిసిందే. గతంలో మల్కాజ్ గిరి ఎంపీగా పని చేసిన ఆయనకు కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవటం విశేషం.  

                           ఇక నూతనోత్సాహంతో పార్లమెంట్ లో అడుగుపెట్టిన పసునూరి దయాకర్ కి షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు సర్వే. గెలిచినా వదిలేది లేదంటున్నారు. అసలు వరంగల్ లోక్ సభకు జరిగిన ఎన్నికనే సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నిక ప్రమాణ పత్రంలో పసునూరి దయాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. అందులో పసునూరి భార్య గృహిణి అని పేర్కొన్నారని, నిజానికి ఆమె ఓ ఎల్పీజీ పంపిణీదారు అని సర్వే ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం ఉన్నవారు పోటీకి అనర్హులని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికలో దయాకర్‌ సమర్పించిన ప్రమాణపత్రంలో సమాచారం తప్పుగా ఇచ్చారని ఎన్నికల అధికారులకు తెలిసినా నామినేషన్‌ స్వీకరించారని వివరించారు. కాబట్టి ఎంపీగా ఆయన ఎన్నికను చెల్లదని, ఆ ఉపఎన్నికనే రద్దు చేసినట్లుగా ప్రకటించాలని హైకోర్టును కోరారు. మరి న్యాయస్థానం ఈ విషయంలో ఎలా స్పందిస్తుదో వేచి చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ