ఉత్తరాది, దక్షిణాది మహిళల మధ్య శరద్ యాదవ్ చిచ్చు

March 14, 2015 | 02:51 PM | 87 Views
ప్రింట్ కామెంట్
sharadyadav_niharonline

అందంగా ఉన్నదంటూ వ్యాఖ్యానించడం జెడీయూ లీడర్ శరద్ యాదవ్ కొంపకు నిప్పంటుకుంది. మాకు నచ్చలేదని మహిళా లోకం గుర్రుమంటుంటే అది కూడా తప్పేనా అంటూ మొరాయిస్తున్నాడు. దక్షిణాది ఆడవాళ్లు అందంగా ఉంటారంటే ఏదో పోనీలే అనుకుందురు. నల్లగా ఉన్నా సరే అందంగానే ఉంటారని నారదుడి లెవెల్లో ఓ అగ్గి పుల్ల వేసాడు. దాంతో  మహిళలు భగ్గుమంటున్నారు. ప్రక్రుతిలోనే అందంగా ఉండడం ఆడవాళ్ళ సొంతం. నలుపా తెలుపా అనే మీమాంసతో కొరివితో తలగోక్కోకూడదు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు శాతాన్ని పెంచటాన్ని ఆయన భారతదేశ పురుషులకు తెల్ల మహిళలపై ఉన్న ఆసక్తిని పోల్చుతూ వర్ణించారు. దక్షిణాది మహిళలు నల్లగా ఉన్నా చాలా అందంగా ఉంటారని...వారు నృత్యాలు చేస్తుంటే కళ్లు తిప్పుకోలేమన్నారు. వారికి ఎంతటివారినైనా ఆకట్టుకునే అందం ఉందన్నారు. అలాంటి వాళ్లు ఉత్తరభారతంలో కన్పించరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పలువురు మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శరద్‌ యాదవ్‌ వ్యాఖ్యలు దక్షిణాది మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆందోళనకు దిగారు. వెంటనే ఉపసంహరించుకుని.... దేశంలోని మహిళలందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్‌, సీపీఎం, బీజేపీ  కూడా శరద్‌యాదవ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టాయి. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. అయితే శరద్‌యాదవ్‌ అందుకు అంగీకరించలేదు. తానెవరనీ విమర్శించలేదని...కేవలం దక్షిణాది మహిళల అందాన్ని మాత్రమే వర్ణించానని  చెప్పారు. విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.... పార్టీ అధ్యక్షుడి తరపున జేడీయూ ఎంపీ కేసీ త్యాగి క్షమాపణలు చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ