తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడి తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి వారంతా ప్రస్తుతం అసెంబ్లీ బయటే తచ్ఛాడుతున్నారు. ఇక ఇలా ఎన్నిరోజులనుకున్నారో ఏమో తమపై సస్పెన్షన్ ఎత్తివేయించాల్సిందిగా పీసీసీ చీఫ్ జానారెడ్డిని వారు ఆశ్రయించారు. ఇక ఆయనేమో తప్పకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారట. అయితే పనిలో పనిగా ఓ కండీషన్ ఆయన పెట్టారట. సభలో అధికార పక్షాన్ని తిట్టకుండా ఉంటే, కేవలం గంటలోనే వారి సస్పెన్షన్ ఎత్తివేయిస్తానని ఆయన వారితో అన్నారట. ఈ బంఫర్ ఆఫర్ ను రేవంత్ రెడ్డి అక్కడికక్కడే తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వంపై పోరు సాగించకుండా ఎలా ఉంటామని రేవంత్ జానాతో అన్నారట. మీరే కాదు... మేము కూడా ప్రతిపక్షమేగా, మేం ప్రభుత్వాన్ని తిట్టడం లేదు కదా అంటూ జానా కాస్త ఘాటుగానే స్పందించారట. ప్రభుత్వాన్ని నిలదీయాలంటే దూషణలే మార్గం కాదు కదా అని కూడా ఆయన ఒకింత సున్నితంగానే రేవంత్ ను మందలించినట్లు తెలుస్తోంది. ఎంతయినా రాజకీయ భీష్ముడు కదా సీనియర్ సీనియరేేలేండి...