తాము అధికారంలోకి వస్తే మద్యం షాపులనేవి లేకుండా చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాకినాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మమేకమయ్యారు.
ప్రత్యేక హోదా, యూనివర్శిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయని విషయం... మొదలైన అంశాలపై విద్యార్థులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యం లేకుండా చేయాలని ఒక విద్యార్థిని ప్రశ్నించగా.. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యం షాపులు లేకుండా చేస్తామని జగన్ అన్నారు. మద్యం షాపులు లేని గ్రామాల్లో సైతం వాటిని ఏర్పాటు చేసేందుకు తమ మనుషులతో చంద్రబాబు టెండర్లు వేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.