ఉరుము ఉరిమి కూకట్ పల్లి మీదా?

March 11, 2015 | 05:53 PM | 41 Views
ప్రింట్ కామెంట్
akbaruddin_in_assembly_niharonline

తెలంగాణకు కేంద్ర బడ్జెట్, ఆర్థిక సంఘం ఎడాపెడా అన్యాయం చేశాయన్నారు అక్బరుద్దీన్. తెలంగాణపై రుద్దే పన్నుల్లో మూడోవంతు కూడా గ్రాంట్ల రూపంలో ఇవ్వనందుకు నొచ్చుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిలదీయాలని అన్ని పక్షాల సహకారం అర్థించేరు. దీన్నెవ్వరూ ప్రశ్నించేదికాదు. వెల్ కమ్ చేయాల్సిందే. తెలిసే సదరు అంశాన్ని ఉపోద్ఘాతంగా వాడుకుని మైనార్టీల సంక్షేమ విషయంలో ఆశాభావాన్ని కూడా వ్యక్తీకరించేరు. పాతనగరాన్ని ఇస్తాంబుల్ గా తీర్చి దిద్దుతానన్నమాట కేసీఆర్ గారు నిలబెట్టుకుంటే అదే పదివేలు అన్నారు. ఇంతవరకూ భేషుగ్గా ఉంది. మధ్యలో కాందిశీకుల్లా మిగిలిపోయిన ఆంధ్రోళ్లు ఏం చేసితిరి?. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి ప్రాంతంలో సచివాలయ నిర్మాణం కూడ మంచిదేనంటూ కితాబిచ్చేరు. ఇదీ బాగానే ఉంది. కూతవేటు దూరంలో ఉన్న కూకట్ పల్లి ప్రాంతం అంతా ఆంధ్రావారితో నిండిపోయి ఉన్న వైనం ఉదహరిస్తూ ఎర్రగడ్డలోని ఈ నిర్మాణం ఆంధ్రప్రాంతం వారికి చేరువైపోగలదని ధర్మసందేహం వెలిబుచ్చేరు. దీని భావమేమి భాయ్ సాబ్?. ఛాతీ ఆసుపత్రి వగైరాలను మెదక్ సమీపంలోని అటవీప్రాంతానికి తరలించే బదులు, అవాంఛనీయ ప్రాంతీయుల్ని అక్కడ దూరంగా కాపురాలు చేస్కోమనరు కదా దొరవారూ? ఆసుపత్రులు అందుబాటులోనే ఉండాలంటే ఎవరూ కాదనలేరు కదా? ఇద లక్ష దీనార్ల ప్రశ్న!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ