గురివింద అరవిందా... గోవిందా!

March 12, 2015 | 05:31 PM | 39 Views
ప్రింట్ కామెంట్
arvind_kejriwal_sting_audio_tape_niharonline

ఢిల్లీ రాజకీయాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ నేతగా ఉన్న సమయంలో ఓ అవినీతి బాగోతానికి పాల్పడ్డారన్న వార్త షాక్ కి గురిచేస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే ఒకరు విడుదల చేసిన ఆడియో టేప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గతేడాది ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేజ్రీవాల్ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగాలని తనతో అన్నట్టు మాజీ ఎమ్మెల్యే రాజేశ్‌గార్గ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విడగొట్టి వారు కొత్త పార్టీ ఏర్పాటు చేసి మనకు మద్దతు ఇచ్చేలా మాట్లాడాలని కేజ్రీవాల్ తనతో అన్నట్టు ఉన్న ఆడియో టేప్‌ను ఆయన బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే కొనుగోలును తాను వ్యతిరేకించి అప్పటి నుంచి తాను పార్టీ కార్యాలయానికి వెళ్లడం మానేశానని అన్నారు. ఈ విషయం బయటకు రావడంతో మహారాష్ట్ర ఆప్ నేత అంజలీ దమానియా పార్టీకి రాజీనామా చేశారు. కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడ్డారని ఓ ఛానెల్ ప్రసారం చేసిన ఆడియోను తన ట్వీట్‌కు జత చేశారు. అలాగే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్‌ను పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని 50 మంది ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేశారు. ఇక ప్రస్తుతం పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో చీలిక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ