అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తూ బీజీపీ పార్టీని చిత్తుచేసిన కేజ్రీవాల్ పార్టీ అమ్ ఆద్మీ లోనూ అప్పుడే చీలికలు ఏర్పడే పరిస్థతి దాపురించింది. పార్టీలో అనేక విభేదాలు ఉన్నట్లు అంతర్గత లోక్ పాల్ కమిటీ పార్టీ నాయకత్వానికి ఒక లేఖ రాసినట్టు తెలుస్తోంది. పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడుతున్నట్టు తెలియజేసింది. పార్టీలో తలెత్తు తున్న విమర్శలకు పరిష్కారం చూపాల్సి ఉందని సూచించింది. ఒక్కరికి ఒకే పదవి అనే విధానన్ని పాటించాలని తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థల ఎంపికలో ఈ భేదాభిప్రాయాలు పొడచూసినట్టు తెలుస్తోంది. పార్టీలో ఏర్పడిన లోక్‌పాల్ కమిటీ ఈ మధ్యనే పార్టీ జాతీయ కార్యవర్గ ఎంపికకు ముందే ఆప్ రాజకీయ సలహా కమిటీకి లేఖ రాసింది. ఆరు నెల్లుగా ఈ పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయనీ, అగ్రనాయకత్వంలో విశ్వాసనీయత లోపించిందనే మాటలు నిపిస్తున్నాయంది. ప్రధానంగా సీఎం కేజ్రీవాల్ రెండు పదవులు సీఎంగా, పార్టీ జాతీయ కన్వీనర్‌గా కొనసాగడంపై అభ్యంతారలు ఉండడంతో ఆయన పార్టీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. దీంతో పార్టీ నాకుల్లో అసమ్మతి జ్వాలలు తగ్గుముఖం పట్టినట్టు సమాచారం