కొత్త సచివాలయానికి సీఎం కసరత్తు

March 16, 2015 | 03:33 PM | 47 Views
ప్రింట్ కామెంట్
AP_Secretariat_niharonline

కేసీఆర్ ఉడుం పట్టు. ఏదైనా అనుకున్నారంటే దాన్ని అమలు చేయనిది నిద్రపట్టదు. తెలంగాణ రాష్ట్రం సాధించడం తన చిరకాల కోరికగా అంటూ వచ్చారు. చివరికది సాధించారు. ఇపుడు బంగారు తెలంగాణ సాధించాలని అనుకుంటున్న కేసీఆర్ అందుకు తగిన సాంస్కృతి నిర్మాణమే కాదు., కట్టడాల నిర్మాణంలోనూ తగిన మార్పులు చేయాలని సంకల్పించారట. ఇందులో భాగమే కొత్త సచివాలనం నిర్మించాలనే తలంపు. ఇది భవిష్యత్తులో చారిత్రక కట్టడంగా నిలిచిపోవాలనేది ఆయన ఆకాంక్ష అని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఓ మంత్రితో కేసీఆర్ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అది ఆఫీసులా కాకుండా ఒక రాజ ప్రసాదంలా ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారట. ఇక సదుపాయాల విషయంలో  జాతీయపండుగలైన గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవాలకు పరేడ్ గ్రౌండ్ కు వెళ్లక్కర్లేకుండా ఇందులోనే పరేడ్ ఏర్పాట్లుండాలన్నది కేసీఆర్ ఆదేశం. ముఖ్యమంత్రికి అందుబాటులోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాంబర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆరు బ్లాకులుగా ఏర్పాటుచేసే కొత్త సెక్రటేరియట్ లో ఒక బ్లాకు పూర్తిగా సీఎం, ఆయనను కలిసే ప్రముఖుల కోసం ఉపయోగించాలని పేర్కొన్నారు. అదే బ్లాక్ లో సీఎస్ ఛాంబరును ఉంచాలని చెప్పారు. దీంతో పాటు సెక్రటేరియట్ లో పచ్చదనం కనిపించాలని, సర్వమతాల ప్రార్థన మందిరాలు ఉంచాలని ఆయన సదరు మంత్రికి సూచించినట్లు సమాచారం. మొత్తం మీద ఉద్యోగులకు, సందర్శకులకు ఒక అద్భుతాన్ని చూసినంత అనుభూతి కలిగేలా సచివాలయం ఉండాలనేది ఆయన కోరిక అంటున్నారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ