మిత్ర ధర్మాన్ని విస్మరిస్తున్నది ఎవరబ్బా?

March 10, 2015 | 12:06 PM | 46 Views
ప్రింట్ కామెంట్
Cold_War_Between_TDP_BJP_AP_Politics_niharonline

కేంద్ర బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడటం మనకు తెలిసిందే. ఆర్థిక సంఘం సిఫార్సులతోపాటు బడ్జెట్ కేటాయింపులపై కూడా ఆయన పెదవి విరిచారు. కేంద్రం వేసిన ముష్టి లోటు బడ్జెటును పూడ్చుకోవటానికే సరిపోతుందని, ఇక అవసరాల కోసం ప్రతీసారి చెయ్యి చాచాల్సిందేనా అని సూటిగా ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో లో ప్రకటించిన అంశాలకు ఊతం అందిస్తుందన్న భావనలో ఉన్న టీడీపీకి మిత్ర పక్షం బీజేపీ చదివి వినిపించిన బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించింది. ముఖ్యమైన ప్రత్యేక హోదా అంశాన్నే పక్కన పడేసిన కేంద్రం, కనీసం ప్రకటించిన ఆర్థిక సాయంలో కూడా ఏపీ పై కనికరం చూపలేదన్నది అక్షర సత్యం. మరోవైపు ఇనాళ్లు అంతంగా ప్రభావం చూపని ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి సైతం బడ్జెట్ కేటాయింపులు ఓ బలమైన ఆయుధంగా దొరికింది. దీంతో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించుకుందట. మరోవైపు అసెంబ్లీలో గనుక కేంద్రంలోని తమ పార్టీపై ఆరోపణలు వస్తే వాటిని గట్టిగా ప్రతిఘటించాలని బీజేపీ ఎంఎల్ఏలు నిర్ణయించారు. కేంద్రంలో తమ పార్టీతో మిత్రత్వాన్ని నడుపుతూ ఇక్కడ మాత్రం తమను శత్రువుల్లా చూస్తున్నారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. మిత్ర ధర్మాన్ని వారు విస్మరించారిన దుయ్యబడుతున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన బీజేపీ ఎంఎల్ఏలు తెలుగుదేశం పార్టీ నేతల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ గురించిగానీ, తమ నేత మోదీ గురించి గానీ ప్రస్తావన వస్తే సమర్థవంతంగా ఎదుర్కొవాలని వారు ప్రణాళిక రచించుకున్నారట. ఈ ఆరోపణ ప్రత్యారోపణలతో గత కొద్దికాలంగా టీడీపీ బీజేపీ మధ్య మైత్రికి ఫుల్ స్టాఫ్ పడుతుందన్న వార్తలకు ఆజ్యం పోస్తున్నట్లవుతోంది. గ్రాండ్ అలయన్స్ కి గ్రాండ్ ఎండింగ్ పడే సమయం దగ్గర పడుతుందా? ఇంతకీ మిత్ర ధర్మాన్ని నిజంగా విస్మరిస్తున్నది ఎవరంటారు?...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ