గవర్నరుడిలోని సింహం లేచింది!

March 07, 2015 | 01:33 PM | 43 Views
ప్రింట్ కామెంట్
governer_narasimhan_niharonline

ఏపీ ప్రభుత్వం పరిస్థితి దయనీయంగా మారిందనీ, విభజన వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఎపీపై వకాల్తా పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చంద్రబాబు స్వరాన్ని తన మాటలతో చెపుతూ... నొప్పించక తానొవ్వక అన్నట్టుగా కేంద్రప్రభుత్వం నెత్తిమీద చిన్న మొట్టికాయ వేశారు. ఇరు రాష్ట్రాలుగా విడిపోవడం వల్ల ఎపీకి జరిగిన నష్టం గత సభలో చర్చించడం జరిగిందనీ, విభజన సహేతుకంగా లేదని అంటూ ఎక్కువ శాతం ఎపీ లో ఉన్న ఆర్థిక లోటు గురించి మాట్లాడారు. కేంద్రం నుంచి ఏపీ కి ఎటువంటి సహాయం అందడం లేదని అన్నారు. ఎపీ గురించి పట్టించుకోకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం సాయం కోసం ఎదురు చూస్తున్న ఏపీ ప్రభుత్వం వారు మౌనంగా ఉండడంపై టిడిపి ప్రభుత్వంలో అసంతృప్తి బయటపడుతోందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ కేంద్రం సహాయం కోసం ఎదురు చూస్తున్న టిడిపి ప్రభుత్వానికి ఆయన మాటలు కాస్త బలాన్ని ఇచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఇక వారు కేంద్రంపై నేరుగా విమర్శలు మొదలు పెడతారా? లేకా నొప్పించక తానొవ్వక అన్నట్టు వ్యవహరిస్తారో చూడాలి. గవర్నర్ వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీకి ఎదురు చూస్తున్నట్లు, తుఫాను వల్ల కూడా ఏపీ చాలా నష్టపోయిందనీ చెప్పారు. ఏపీ ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివ్రుద్దివైపు నడవాలంటే, ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రసంగంలో ప్రత్యేక రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సంఘం సిఫార్సులు కూడా నిరాశ కలిగించాయని గవర్నర్ అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామనీ, ఈ ప్రాజెక్టు కోసం వంద కోట్లు మాత్రమే కేటాయించడం అసంతృప్తి కలిగించిందని అన్నారు. చంద్రబాబు అభివృద్ధి విజన్ ను పూర్తి స్థాయిలో వివరించారు. గవర్నర్ ప్రసంగం వల్ల టిడిపి నాయకులు సంయమనం పాటిస్తారా? లేక కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తారా వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ