బాబు ప్రాణాల కోసం కృష్ణానదిలోనూ జల్లెడ!

January 12, 2016 | 11:38 AM | 1 Views
ప్రింట్ కామెంట్
heightened security for CM chandra babu following threat alert

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఫ్రాణ హాని ముప్పు ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు జారీచేశాయి. ఇప్పటికీ ఆయనకున్న భద్రత సరిపోదని, సెక్యూరిటీని మరింత పెంచాలని ప్రభుత్వానికి నిఘా విభాగం నుంచి సూచనలు అందాయి. ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నందున భద్రత కల్పించే విషయంలో అనుక్షణమూ అప్రమత్తంగా ఉండాలని అధికారుల నుంచి ప్రభుత్వానికి లేఖ అందింది.

                                    ఈ లేఖలో చంద్రబాబుకు మరింత భద్రతపై పలు సూచనలు ఉన్నాయి. ఆయన ప్రయాణించే చాపర్, విమానం తదితరాలను ప్రయాణానికి ముందు పూర్తిగా తనిఖీలు చేయాలని నిఘా విభాగం సిఫార్సు చేసింది. ఆయన ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ పక్కనే కృష్ణా నది ఉందని గుర్తు చేస్తూ, మర పడవల్లో పోలీసులతో 24 గంటలూ కాపలా కాయించాలని, బోట్లలో గజ ఈతగాళ్లు, సీఆర్పీఎఫ్ పోలీసులు ఉండాలని పేర్కొంది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి అనంతరం పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘావర్గాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బాబుకు కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ