దాసరి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం?

March 23, 2015 | 01:34 PM | 69 Views
ప్రింట్ కామెంట్
dasari_narayanarao_coal_scam_niharonline

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కోల్ కుంభకోణం లో దర్శకరత్న, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు పేరు మరో సారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఆయనను విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఇక ఆయన ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూపీఏ-1 హయాంలో ఈ బడా స్కాం జరుగగా, ఆ సమయంలో దాసరి దాసరి బొగ్గుశాఖ సహాయ మంత్రిగా వున్నారు. జార్ఖండ్‌లో జిందాల్ కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపుల్లో అవినీతి జరిగిందనీ, కేటాయింపులు జిందాల్ సంస్థకు దక్కేలా దాసరి వ్యవహరించారనీ ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిగా ఆయనకు చెందిన సౌభాగ్య మీడియాలో జిందాల్ పెట్టుబడులు పెట్టిందని (క్విడ్ ప్రోకో), ఈ పెట్టుబడులు కూడా ముడుపులతో సమానమని సీబీఐ ఛార్జి షీట్ తయారుచేసింది. ఇక దీని ఆధారంగా దాసరి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రంగం సిద్ధం చేసుకుంటుందని, ఇది అతి త్వరలోనే ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.  సోమవారం సాయంత్రం కల్లా ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బొగ్గు కుంభకోణంలో తన ప్రమేయం లేదని, 40  కూడిన కమిటీ ఓకే చేశాకనే తాను ఫైల్స్ పైన సంతకం చేశానని, తాను నిరపరాధిగా తేలుతానని విచారణ సమయంలో దాసరి పేర్కొన్న విషయం తెలిసిందే.
 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ