కోర్టు ఆర్డరును ధిక్కరించినందుకు గాను ఎపీ రవాణా మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే కరణం బలరాం మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరు కాకుండా నిర్లక్ష్యం చేసినందుకు గాను దీన్ని కోర్టు తీవ్రస్థాయిలో పరిగణనలోకి తీసుకొని పోలీసులను వారిని ఎందుకు హాజరు పరచలేదంటూ ప్రశ్నించింది. వీరు ఒంగోలు కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేసినందుకు గాను వీరిపై కేసు ఫైల్ చేశారు. విచారణకు నేడు బెంచ్ మీదకు రాగా అడ్వకేట్ శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. వారు కోర్టుకు హాజరు కానందున దీనికి వివరణ ఇవ్వాలని ఒంగోలు డి.ఎస్.పి ని ఆదేశించారు. ఇదే కేసులో విచారణకు హాజరైన తెలుగుదేశం నాయకురాళ్ళు నన్నపనేని రాజకుమారి, టి.అరుణ, మరో నేత దివి శివరాంలను అక్కడే ఉండాలని జడ్జి ఆదేశించారు.