మోదీకి తప్పని ఇంటి పోరు

March 03, 2015 | 02:45 PM | 50 Views
ప్రింట్ కామెంట్
prahlad modi_niharonline

ఇన్నేళ్ళ భారత చరిత్రలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన ఘనత మోదీకి దక్కింది. కానీ ఇప్పుడు ఢిల్లీ ఫలితాలతో దానికి బ్రేకుపడినట్టయ్యింది. మరికొద్ది రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు మోదీ ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయి. దీంతో మోదీ ప్రభుత్వంపై వస్తున్న పలు విమర్శలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ పార్టీల విమర్శలు ఎదుర్కోవడం ఒక ఎత్తయితే ప్రస్తుతం మోదీకి ఇంటిపోరు మొదలైంది. చిన్న తమ్ముడు ప్రహ్లాద్ మోదీ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముంబయిలోని ఆజాద్ మైదానంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన ప్రదర్శన జరిగింది. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రహ్లాద్ మోదీపై చేస్తున్న విమర్శలు ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించాయి. ఆయన తమ్ముడు మోదీ ప్రభుత్వ పనితీరును విమర్శించడమే కాకుండా రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని సవాల్ చేస్తున్నాడట. యూపీ ఎన్నికల్లో 75 వేల మంది రేషన్ డీలర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని అందుకే 73 ఎంపీ స్థానాలు గెలుచుకుందని. తమ కోరికలు తీర్చని పక్షంలో రానున్న ఎలక్షన్లే తీర్పు ఇస్తాయని ఆయన హెచ్చరిస్తున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ