కాబోయే గవర్నర్ కంట కన్నీరు

January 14, 2016 | 02:15 PM | 2 Views
ప్రింట్ కామెంట్
motkupalli narasimhulu crying niharonline

ఏపీలో విశేష అధికారం అనుభవిస్తున్న తెలుగుదేశం పరిస్థితి తెలంగాణలో అగమ్య గోచరంగా తయారైంది. వరసపెట్టి సీనియర్ నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారు. నిన్న గాక మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, సీనియర్ నేత విజయ రామారావు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. అంతకు ముందు అయిదుగురు ఎమ్మెల్యేలు ఇదే తరహాల్లో పార్టీ మారు. గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే పార్టీ పరిస్థితి మరి ఘోరంగా తయారయ్యింది. పైకి రేవంత్ రెడ్డి లాంటి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ దాదాపు బిచాణా ఎత్తేసిన పరిస్థితి అని అందరికీ తెలిసిందే.

                       ఇక తెలంగాణలో నానాటికీ దిగజారుతున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితిని తలుచుకుని సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కంటతడి పెట్టారట. పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న ఆయన ఓటమి తర్వాత స్తబ్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకనోక టైంలో ఆయనకు గవర్నర్ గిరి కట్టబెడతారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పార్టీ ఖాళీ అవుతుండటంతో తలుచుకుని ఏడ్చేశారంట. ఈ ఘటన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఓ సమావేశంలో జరిగినట్టు తెలుస్తోంది. పలువురు నేతలు వేదికపై ఉండగా, మోత్కుపల్లి ప్రసంగిస్తూ, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇలా నామరూపాల్లేకుండా పోతున్నదని ఉద్వేగానికి లోనయ్యారని సమాచారం. రాష్ట్రంలో పార్టీని బతికించుకోవాలని కూడా మోత్కుపల్లి సూచించారట. త్వరలోనే ఆలేరు నియోజకవర్గంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ప్రజలను కలుస్తానని ఈ సందర్భంగా మోత్కుపల్లి వెల్లడించినట్టు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ ని తలుచుకుని మోత్కుపల్లి బాగానే ఏడ్చినట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ