బ్రహ్మచారి యువరాజు ‘ఏకాంతాన్ని’ కోరుకుంటున్నారు?

March 13, 2015 | 04:27 PM | 49 Views
ప్రింట్ కామెంట్
rahul_gandhi_leave_niharonline

రాజకీయమనే మాటకు వర్తమాన పరిస్థితుల్లో అంత ఘనమైన అర్థంలేదు. అందునా పాలిటిక్స్ ఈజ్ ది లాస్ట్ రిసార్ట్ ఫర్ స్కౌండ్రల్స్ అని బెర్నాడ్ షా ఏనాడో నిర్వచించాడు. అదే దానికి ప్రజాసేవ అనే ముసుగు తొడిగితే కొద్దిగా అంగీకరించే అవకాశం మినుకు మినుకు మనగలదు. మరి అంత బంగారు ప్రజాసేవకు సెలవుపెట్టిన రాహులుడు శలవులో ఏ దూర హారాలకు పయనమయ్యేడు? ఒకపక్క పార్లమెంటు నడుస్తోంది. బడ్జెట్ బరువు తూకంగా ప్రజలనెత్తిన పడుతోంది. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ హడావుడి ఒకటి. ఈలోపున మన్మోహన్ అంకుల్ ఇంటికి సానుభూతి యాత్ర మరోకటి. ఇటువంటి సంఘటనల నేపథ్యంలో నెహ్రూగారి మునిమనుమడు, ఇందిరమ్మ మనువడు, రాజీవ్ సుపుత్రుడు బ్రహ్మచారి అయిన రాహుల్ గాంధీ కెమెరా దెబ్బకు దొరక్కుండా సెలవుపెట్టి అందరిలోనూ ఉత్కంఠను రేగ్గొట్టి పెట్టిన శెలవును మళ్లీ పొడగించి ‘ఏకాంతాన్ని’ అనగా పెడర్థాలు తీయకుండా ఒంటరితనాన్ని కోరుకుంటున్నాడనిన్నీ, దాన్ని యావన్మందీ గౌరవించే అవసరం ఉందనిన్నీ కాంగ్రెస్ నాయకుడు సూర్జీత్ వాలా విజ్జప్తి చేసేరు. అలాగే కానిద్దాం!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ