నూటొక్క హామీల కేసీఆర్ కు షబ్బీర్ ఫర్మానా

March 05, 2015 | 01:28 PM | 51 Views
ప్రింట్ కామెంట్
shabbir_ali_pharmana_niharonline

ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం ఏ నాయకులైనా చేసే పనే, కానీ కేసీఆర్ ఇచ్చిన హామీలను పెద్ద చిట్టాగా తయారు చేసి ఆయనకే పంపారు పీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ. ఈ హామీలన్నిటినీ నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన 101హామీలను 10 అడుగుల లేఖ రూపంగా (ఫర్మానా-రాజుల కాలంనాటి లేఖ) కేసీఆర్ కు పంపించారు షబ్బీర్ అలీ. అంతే కాదు ముఖ్యమంత్రి పాలన, వ్యవహారశైలిని నియంతల ధోరణిలా ఉందని దుయ్యబట్టారు. ఉన్న హామీలను నెరవేర్చకుండా రోజుకో కొత్త హామీతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. తెలంగాణ పోరాటంలో 2 వేల మంది ఆత్మహత్యలు చేసుకోగా, ఇప్పటి వరకూ కేవలం 459 కుటుంబాలకు మాత్రమే సహాయం చేశారని అన్నారు. రైతుల రుణ మాఫీలు కూడా 25 శాతం మాత్రమే చేశారని అన్నారు. గిరిజనులకు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం, ఇప్పుడు చట్టబద్ధత లేని విచారణ కమిషన్లను ఏర్పాటు చేయడం మోసమని షబ్బీర్ విమర్శిస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఇంతవరకూ మూడింటికి మాత్రమే మోక్షం కలిగిందని ఆయన వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ