పెడితే పెళ్ళి.. లేపోతే తద్దినం! శఠగోపం!

March 04, 2015 | 04:45 PM | 74 Views
ప్రింట్ కామెంట్
Swaroopanandendra_Saraswati_niharonline

మారుటి ప్రభుత్వాలు మఠాధిపతులను విస్మరిస్తున్నాయట వీరిని సంప్రదించకుండా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శపించేస్తున్నారు. కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక విషయాల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మఠాధికారులను, పీఠాధిపతులతో ఏమీ చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. హైందవ మతాలకు మంచి జరుగుతుందని ఎన్నికలప్పుడు ఈ ప్రభుత్వాలను గెలిపించేందుకు రోడ్ల మీదకు వచ్చామని స్వరూపానంద ఒక రహస్యం బట్టబయలు చేశారు. కానీ ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులను విస్మరిస్తోందనీ, ఈ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని అనుగ్రహభాషణం అందజేశారు. పుష్కరాలను కూడా ఆధ్యాత్మికంగా కాకుండా, అధికారికంగా నిర్వహించాలన్న దుర్మార్గపు ఆలోచనలతో ఈరెండు ప్రభుత్వాలు ఉన్నాయని, శ్రీరామ నవమి ఉత్సవాలను ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలనే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన భక్త రామదాసు పంథాలో ఎవడబ్బ సొమ్ము రామచందరా అంటూ ఆదితాళంతో ఆక్రోశించారు. ఇటువంటి లంపటాల్లో ఇరుక్కోకుండా నెహ్రూపండితుడు నేను నాస్తికుణ్ణి మొర్రో అని శలవిచ్చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ