తెలంగాణ పూర్తిస్థాయి తొలిపద్దు ఇదిగో...

March 11, 2015 | 11:43 AM | 60 Views
ప్రింట్ కామెంట్
telangana_govt_budget_2015-16

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం నాడు 2015-16 సంవత్సరానికిగానూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణ అమరవీరులకు జోహర్లు అర్పించిన అనంతరం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు గర్వంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన కృతజ్ఞతలని ఆయన తెలిపారు. ప్రతీ పైసా తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కేటాయిస్తామని, బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదని, జీవం లేని అంకెల కూర్పు కాదని.. సారం లేని గణాంకాలు అంతకన్నా కాదన్నారు. బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బడ్జెట్ అని తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈటెల ప్రకటించారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు కూలంకషంగా... మొత్తం తెలంగాణ బడ్జెట్ రూ.1,10,500 కోట్లు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ. 52, 383 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లు. ఆర్థిక మిగులు రూ. 501 కోట్లు, ద్రవ్యలోటు అంచనా రూ.16,969 కోట్లు, రెవెన్యూ మిగులు : రూ. 531 కోట్లు, పన్నుల రాబడి రూ.12,823 కోట్లు. కులాల కోసం కేటాయింపుల విషయానికొస్తే... ఎస్సీ సంక్షేమానికి రూ.5,547 కోట్లు. గిరిజన ఎస్టీ సంక్షేమం రూ.2,578 కోట్లు, బీసీ సంక్షేమం రూ.2,172 కోట్లు, మైనార్టీ సంక్షేమం రూ.1105 కోట్లు. ఆసరా పెన్షన్లు రూ.4వేల కోట్లు, కేంద్ర పన్నుల వాటా: రూ.12, 823 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రూ.526 కోట్లు, విద్యా రంగానికి రూ.11,216 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.7,400 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.2,083 కోట్లు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ.22,889 కోట్లు, ఎర్రజొన్న రైతులకు రూ.13.5 కోట్లు, హైదరాబాద్ నీటి సరఫరాకు వెయ్యి కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ. 771 రూ. కోట్లు, ఆర్టీసీకి రూ.400 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.4, 250 కోట్లు, గ్రీన్ హౌస్ వ్యవసాయానికి రూ.250 కోట్లు, ఉస్మానియా యూనివర్శిటీ అభివ్రుద్ధి కోసం రూ.238 కోట్లు, అటవీ శాఖ, పర్యావరణానికి రూ.325 కోట్లు, తెలంగాణ వాటర్ గ్రిడ్ కు రూ.4వేల కోట్లు, రోడ్లు అభివృద్ధికి రూ.2,421 కోట్లు, డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.200 కోట్లు, తద్వారా లక్ష ఎకరాల సాగు నీరందించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామిక ప్రోత్సహాలకు రూ. 974 కోట్లు, బీడీ కార్మికుల సంక్షేమానికి రూ.188 కోట్లు, దళితుల భూముల కొనుగోలుకు వెయ్యి కోట్లు, అంగన్ వాడీ సిబ్బందికి వేతనాలు పెంపు, టీచర్లకు రూ.7వేలు, కార్యకర్తలకు రూ.4వేలు, ప్రతి అంగన్ వాడీ కేంద్రానికి వెయ్యి వన్ టైమ్ గ్రాంట్. వైద్య శాఖకు రూ.4,932 కోట్లు, ఆహార భద్రత, సబ్సిడీకి రూ.1,105 కోట్లు, ముచ్చెర్లలో 11వేల ఎకరాలతో ఫార్మా సిటీ, హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్, ఫ్లై ఓవర్ల నిర్మాణం అభివ్రుద్ధి కోసం రూ.1600 కోట్లు, సిటీ పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి రూ.50వేల కోట్లు, గ్రామీణ పోలీస్ స్టేషన్ అభివృద్ధికి రూ.25 వేల కోట్లు, పంచాయతీ రాజ్ కు రూ.2,421 కోట్లు, కిలోవాట్ సామర్థ్యం గల 4వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పనున్నట్లు ప్రసంగంలో మంత్రి పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ