ఆప్ కమిటీలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు

March 05, 2015 | 12:27 PM | 52 Views
ప్రింట్ కామెంట్
yogendrayadavaap_niharonline

ఆమ్ ఆద్మీ పార్టీలు గత కొన్నాళ్ళుగా నడుస్తున్న వివాదాలకు బుధవారంతో ముగింపు పలికినట్టయ్యింది. పీఏసీ లో సీనియర్ నాయకులు, పార్టీ వ్యవస్థపాక సభ్యులైన యేగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు చేస్తున్న విమర్శలకు నిన్న మొన్నే అధికారంలోకి వచ్చిన పార్టీ అప్రదిష్టపాలవుతుండడంతో వారిని ఆ పదవుల నుంచి ఉద్వాసన పలికారు. ఈ ఇద్దరూ ఇక పీఏసీలో పని చేయరనీ, వారికి కొత్తగా బాధ్యతలు అప్పగించనున్నట్టు పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. గురువారం సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్న అనంతరం పార్టీ అధికార ప్రతినిధి కుమార్ విశ్వాస్ పత్రికలకు ఈ విషయాలు వెల్లడి చేశారు. ఇక నుంచి ఈ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవని ఆయన తెలిపారు. తమ పార్టీ దేశ ప్రజల కోసం, వారి ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కట్టుబడి పన చేస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో దాదాపు ఐదు గంటల పాటు జరిగిన చర్చల్లో పాల్గొని ఓటింగ్ నిర్ణయించగా పోలయిన 18 ఓట్లలో పార్టీ నిర్ణయానికి అనుకూలంగా 11, ప్రతికూలంగా 8 ఓట్లు పోలయ్యాయి. వేటుకు గురైన ఆ ఇరువురూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని చెప్పారు. అయితే నిన్న కేజ్రీవాల్ కన్వీనర్ పదవికి ఇచ్చిన రాజీనామాను ఈసీ తిరస్కరించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ