పార్టీ పేరు ప్రకటించి పది మాసాలు కావస్తున్న, అధికారికంగా ఈసీ గుర్తింపు లభించినా కూడా పవన్ జనసేన ఇంకా రాజకీయంగా ఎంట్రీ ఇవ్వలేదు. అయితే త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతుందని సమాచారం. ఇటివల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ని ప్రారంబించిన పవన్ కళ్యాణ్ తన మద్దతు బీజేపీ, టీడీపీలకు అందించిన విషయం తెలిసిందే. అంతేకాదు పార్టీ ప్రచారంలో పాల్గొని తనదైన శైలిలో జనాల్ని ఆకట్టుకోగలిగాడు కూడా. ఈ నేపథ్యంలోనే త్వరలో జరిగే ఎన్నికల ద్వారా రాజకీయ బరిలోకి దిగాలని పవన్ గట్టిగా నిర్ణయించుకున్నాడట. ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ ఎన్నికలతోనే నగరంలో సత్తా చాటలని పవన్ భావిస్తోన్నట్లు సమాచారం. తద్వారా పార్టీ బలాబలాలు బేరీజు వేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాడట. అయితే ఈ ఎన్నికల బరిలో స్వయంగా పవన్ యే బరిలో దిగే అవకాశం మాత్రం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి పవన్ సపోర్ట్ తో అధికారంలో కొచ్చిన టీడీపీ, కొంతమేర లాభపడిన బీజేపీ లు గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కు మద్ధతు ఇస్తాయా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. మరి ఈ విషయం పై ఆయా పార్టీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.